Return to the talk Watch the talk

Subtitles and Transcript

Select language

Translation reviewed by Hanu Kunduru

0:11 మనం కంప్యూటర్ని వాడుటలో ఇంకా పురాతన కాలపు విధానములనే ఉపయోగిస్తున్నాము ప్రస్తుతం ఉపయోగం లో ఉన్న విధానాలు మన అవసరాలకు సరిపడే సమాధానాలు కావు ఈ విధానాన్ని నేను మార్చాలని అనుకుంటున్నాను ఇది చూడండి మీరు ఇప్పుడు చూస్తుంది ప్రస్తుతం వాడుక లో ఉన్న అంతర్ముఖం దీనిలో ఎటువంటి జీవం లేదు ప్రయత్నం చేసి కొంచం మాక్ కి దగ్గరగా అందంగా తీసుకొని రావచ్చు ఎంత చేసిన తిరిగి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే వున్నది గత ౩౦ సంవత్సరుమల నుండి ఇదే పరిస్థితి (హర్షద్వనులు) ఇంతవరకు మనం వాడుక లో ఉన్న విధానాలకే బానిసలయిపోయాము అంటే మౌస్ తో వెతికి క్లిక్ చేయడం, మెనూ లో వున్నా వాటిమీద క్లిక్ చేయడం వంటి పనులను క్రమము రీత్యా చేస్తున్నాము

0:51 నేను నా నిజ జీవితంలో ఉపయోగించే డెస్క్ ని ఆదర్శముగా తీసుకోవాలని సంకల్పించాను అది చాల సులభం, వాడుటకు అవలీలగా వుంటుంది ఏది ఎక్కడ వున్నదో చూడగానే తెలుస్తూంది ఇదే అనుభవాన్ని కంప్యూటర్ వాడుక లో తేవటానికి నేను ప్రయత్నం చేశాను ఆ ప్రయత్నమే మీ ముందు వున్నా ఈ —- బమ్ప్ టాప్ ఇది డెస్క్ టాప్ కంప్యూటర్ వాడుట లో ఒక సరికొత్త పద్దతి దీని ద్వారా దేనినైనా ఎక్కడికైనా కదిలించవచ్చు ఇదివరకటి మౌస్ తో క్లిక్ కాకుండా, ఇప్పుడు సులభంగా దేనినైనా కదలించవచ్చు కొన్నిసార్లు కదిలించినవి డీ కొనవచ్చు, నిజ జీవితంలో మన డెస్క్ మీద ఉన్న వస్తువులలాగా నేను వీటన్నింటిని కలిపి పోగుచేసి ఒక దగ్గర ఉంచగలను సాధారణముగా వీటిని ఫోల్డర్లు లో మనం చేర్చుతాం పోగు చేసిన తరువాత వాటిని తిరిగి విభజించవచ్చు లేక పుస్తకంలా తిరగవేయవచ్చు లేక పేకల్లా కట్టగట్టవచ్చు వాటిని పరిచి క్రొత్త ప్రదేశాలకు తెసుకొని వెళ్ళవచ్చు, వాటిని తొలగించవచ్చు అతి సులభంగా, అతి శీగ్రంగా విడగొట్టి జత చేయవచ్చు ఆ తరువాత అంతా ఏంతో సులువైన అనుభూతిని మీకు అందిస్తుంది, ప్రస్తుతం వున్నా శైలికి భిన్నంగా

2:01 వున్న పోగుకు కొత్తగా ఏదైనా జత చేయడం ఎలా? దానిని ఇలా తీసి ఆ పోగుపైకి విసిరితే, దాని లో కొత్తగా కలిసిపోతుంది. ఇది ఎంతో సులువైన మార్గం ఇంకా మనం ఏమి చేయవచ్చంటే ఈ ప్రతిమలిని కొంచెం కొత్త ఆలోచన తో సరికొత్త ప్రయోగం చేయవచ్చు వీటిని పెద్దగ చేయవచ్చు ఎక్కువ ప్రాదాన్యత ఇవ్వాలనుకుంటే

2:21 ఇంకో విశేషమేంటంటే దీని వెనక ఓక చిత్రమైన సిములేషన్ నడుస్తోంది ప్రధానమైనవి బరువుకలిగి ఉండటం వలన, తక్కువ ప్రాధాన్యత కలిగినవి వాటిని నెట్టలేవు దీనిని చిన్నవాటిమీద విసిరితే అవి ప్రక్కకు తొలగుతాయి (హర్షం) చూడటానికి ముద్దుగా వున్నా, ఇది మనకు తగిన సమాచారాన్ని అందిస్తోంది పెద్దవి ఎక్కువ ప్రాధాన్యత కలిగినట్లుగా, చిన్నవి తక్కువ ప్రాధాన్యత కలిగినట్లుగా మనకు తలపిస్తోంది

2:45 కంప్యూటర్లు ఎన్ని వున్న పుస్తకాల ఉపయోగం ఎల్లప్పుడు వుంటుంది ఎందుకంటే పుస్తకాలకు చాల విలువైన ఉపయోగాలు వున్నాయి అటువంటి కొన్ని విలువలను కంప్యూటర్లకు చేర్చడం మా ఉద్దేశం కాబట్టి వీటిని మీరు కాగితం లాగ మడత పెట్టవచ్చు తరువాత వీక్షించేటప్పుడు మీకు గుర్తుకురావడానికి లేకపొతె మీకు అయిష్టము కలిగినప్పుడు వీటిని నలగబెట్టవచ్చు ఒక మూలకి తొలగించవచ్చు సాధారణంగా కాగితం మీద గుర్తుకోసం ఏదైనా వ్రాసి గోడపైన అతికిస్తాం ఇక్కడ కూడా అదేవిధంగా చేయవచ్చు ఆఫీసులో వాడే పోస్ట్-ఇట్ నోట్లు లాగ వీటిని అవసరం ఉన్నప్పుడు ఉపయోగించవచ్చు

3:20 ఈ శైలి లోని ఒక విమర్శ ఏమిటంటే మీ టేబుల్ మీద వస్తువులు చెల్లచేదరగా ఉండవచ్చు అటువంటి అనుభూతిని మీ కంప్యూటర్ మీద పొందటానికి మీరు ఇష్టపడరు అటువంటి వారికోసం ఒక గ్రిడ్ లో సర్దుకోవచ్చు ఇది సాధారణంగా కంప్యూటర్ వాడుకలో ఉండే అనుభూతిని ఇస్తుంది అయిన్నపటికి వీటిలో కూడా మన క్రొత్త అనుభూతిని పొందవచ్చు వీటిని ఒక అరలోని సర్దవచ్చు

3:46 అరను తిరిగి తొలగించవచ్చు. ఇప్పుడు అర ఇంక లేదు కేవలం ఇవేకాకుండా, ఈ సాఫ్ట్ వేర్ ని ఇతర ప్రదేశాలలో కూడా ఉపయోగించవచ్చు కేవలం డెస్క్ టాప్ లో కాకుండా, ఫోటోలను కూడా ఇదేవిధంగా చూడవచ్చు మనం ఫోటోలను చూసే విధానాన్ని మార్చవచ్చు ఒక సరికొత్త శైలి లో వీక్షించవచ్చు వీటిని మనకు నచ్చిన విధముగా అమర్చుకోవచ్చు. ఇక అంతో సులువుగా ఫోటోలను చూడవచ్చు ఫోటో మీద డబల్ క్లిక్ చేసి పూర్తిగా చూడవచ్చు ముందు చూపించిన ప్రక్రియలన్నీ వీటిమీద కూడా ఉపయోగించవచ్చు ఫోటోలను జత పరచుకోవచ్చు, పుస్తకంలా తిరగవేయవచ్చు ఈ ఫోటోను ఇక్కడకు చేర్చవచ్చు, దీనిని తొలగించవచ్చు ఇదంతా కంప్యూటర్ వాడుక లో ఒక కొత్త అధ్యయనాన్ని సృష్టించి, ఒక సరికొత్త అనుభూతిని మిగులుస్తుంది

4:29 ఇదే బమ్ప్ టాప్ . ధన్యవాదములు