ఈరోజు మీరిక్కడ ఉన్న౦దుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే -- మీరు నిర౦తర అభివృద్ది ఎలా మన జీవితాలను రక్షిస్తు౦దో తెలుసుకు౦టారు. కానీ, మనం టెడ్ లో లేనప్పుడు మనకు నిర౦తర విధానపు ఎజెండా అమలుచేయడానికి పనికిరాదని తరచూ చెబుతూఉ౦టారు. ప్రత్యేకంగా న్యూయార్క్ సిటీ వంటి పెధ్ద నగరాలలో, ఇది చాలా సహజ౦. ఎందుకంటే విధాన నిర్ణెయక శక్తి కలిగిన చాలామంది, పబ్లిక్ లేదా ప్రైవేట్ సెక్టార్లో ఉన్నాసరే, నిజంగా వారు ప్రమాదంలో ఉన్నారని గమనించడం లేదు.
ఈరోజు నేను ఇక్కడ ఉండడానికి కారణం, ఒక కుక్క, 1998 లో ఒక అనాధ కుక్కపిల్లను వర్షంలో తడుస్తుండగా చూశాను. దానిని పె౦చుకున్నాను. తర్వాత అది నేను ఊహించిన దానికంటే పెద్దదిగా తయారయింది. అది నా జీవితంలోకి వచ్చే సమయానికి, మేము ఒక భారీ వ్యర్టపదార్టాల నిల్వచేసే సౌకర్యానికి వ్యతిరేకంగా పోరాడుతున్నా౦. ఈస్ట్ రివర్ వాటర్ ఫ్రంట్ కోసం ప్లాన్ చేసిన ప్లాన్ అది. అప్పటికే న్యూయార్క్ సిటీలోని చిన్న ప్రాంతంలో మొత్త౦ కమర్షియల్ వేస్ట్ లో దాదాపు 40 శాతానికి పైగా నిల్వచేయబడుతోంది. ఒక సీవెజ్ ట్రీట్ మెంట్ పెల్లెటైజింగ్ ప్లాంట్, ఒక సీవేజ్ స్లడ్జ్ ప్లాంట్, నాలుగు పవర్ ప్లాంట్స్, ప్రపంచంలోని అతిపెద్ద ఫుడ్ డిస్టిబ్యూషన్ సెంటర్, దానికితోడు ఇతర పరిశ్రమల నుంచి ప్రతీవారం 60,000 ట్రక్కులు ఎన్నో ట్రిప్పులు వ్యర్టాలను డంప్ చేస్తున్నాయి. ఈ ప్రాంతంలో పార్కుల నిశ్పత్తి చాలా తక్కువగా ఉంది.
అందుకే నేను పార్కుల డిపార్టుమెంటును కలిసి వాటర్ ఫ్రంట్ ప్రాజెక్టుల అభివృద్ధికోసం ఒక పదివేల డాలర్ల సీడ్ గ్రాంటుకోసం అడిగాను, వాళ్లు కొంత సానుకూల౦గా మాట్లాడుతారనుకున్నా, కానీ అర్ధం రహితంగా స్ప౦ది౦చారు. నా జీవితమంతా ఈ ప్రాంతంలోనే ఉన్నాను, కానీ మీరీ నదిలోపలికి వెళ్లలేరు పైన పేర్కొన్న "సుందరమైన" సదుపాయాలే ఇ౦దుకు కారణ౦. అప్పట్లో ఒకరోజు ఉదయం నేను నా కుక్కతో కలిసి జాగింగ్ చేస్తు౦డగా అది నన్ను అక్రమ౦గా పోసిన ఒక చెత్త కుప్ప వైపు లాక్కెల్లి౦ది. అక్కడ కుప్పలకొద్దీ చెత్త మరియు ఇతర చెప్పలేని వ్యర్ధాలున్నాయి, కానీ అది నన్ను ఇ౦కా ము౦దుకు లాగుతానే ఉంది. అక్కడ చివర్లో నది కనిపించింది. అది నాకు తెలిసిన ప్రదేశమే. చెత్త కుప్పల వలన మూసుకుపోయిన ఒక వీధి. నన్ను తీసుకువచ్చిన అనాధ కుక్క లాగే, ఈ వీధిని రక్షించాల్సిన అవసరము౦ది. ఈ వీధిని రక్షి౦చడ౦ ఒక గర్వ కారణమైన న్యూ సౌత్ బ్రాంక్స్ పునరుజ్జీవన ప్రార౦భానికి నాంది కాగలదని నాకు అనిపి౦చి౦ది.
నా కొత్త కుక్కపిల్ల లాగే, ఈ కొత్త ఐడియాకూడా నేను ఊహించిన దానికంటే పెద్దది. ఆ దారిలో మేము చాలా మద్దతు కూడగట్టగలిగాము. దాంతో హంట్స్ పాయింట్ రివర్ సైడ్ పార్క్ మొట్టమొదటి వాటర్ ఫ్రంట్ పార్కుగా తయారైంది. అది సౌత్ బ్రాంక్స్ లో గత అరవై సంవత్సరాలలో తయారైన మొట్టమొదటి పార్కు. మేము ఆ పదివేలడాలర్ల గ్రాంటుకు 300 రెట్లకు పైగా మొత్తాన్ని జమచేసి మూదు మిలియన్ల పార్కుగా తీర్చిదిద్దాము.
ఈ ఫాల్ సీజన్లో, నేను ఈ కొత్త పార్కులోనే నా ప్రియునితో మా వివాహ౦ గురించి మాట్లాడబోతున్నాను. థ్యాంక్యూ వెరీమచ్ . (చప్పట్లు). నేను చేస్తున్న ఈ పనులకు ప్రేరణ అతనే. (నవ్వులు) .(చప్పట్లు).
కానీ నాలా పర్యావరణ స్వేచ్చ కోసం జీవించేవాళ్లు బొగ్గుగని బంధనంలో ఉన్న పక్షిలాంటి వాళ్లం. మాకు ఈ సమస్యలు ఇప్పుడే కాదు, ఎప్పుడూ ఉంటాయి. పర్యావరణ న్యాయం అనేది ఒక కొత్త పద౦. దానిని ఇలా నిర్వచి౦చవచ్చు. ఏ సమాజమైనా కూడా పలు రకాల పర్యావరణ సమస్యల భారంతో బాధపడకూడదు అలాగే ఇతర సమాజాల కన్నా ఎక్కువ పర్యావరణ ప్రయోజనాలను ఆశించకూడదు.
దురదృష్టవశాత్తూ, జాతి మరియు వర్గం అనే సూచికల ఆధార౦గా ఎక్కడ పార్కులు, చెట్లు వ౦టి మంచి వసతులు లభిస్తాయో, ఎక్కడ పవర్ ప్లాంట్స్ మరియు వ్యర్ధాల పారబోత వగైరా చెడు వసతులు ఉంటాయో ఊహిస్తున్నాము. అమెరికాలో ఒక నల్లజాతీయురాలిగా, నేను శ్వేతజాతీయుల క౦టే రె౦డు రెట్లు నా ఆరోగ్యానికి తీవ్రమైన హాని కలిగి౦చే కాలుష్య వాతావరణ౦లో జీవిస్తున్నాను. నల్లజాతీయురాలిని అయిన౦దువల్ల నేను ఐదు రెట్లు ఎక్కువగా కాలుశ్య౦ కలిగి౦చే పవర్ ప్లాంటు లేదా రసాయన పరిశ్రమకు కూతవేటు దూర౦ లో నివసిస్తున్నాను. ఈ భూ వినియోగ నిర్ణయాలు చాలా సంక్లిష్ట పరిస్థితులను తయారుచేశాయి వాటివల్ల స్థూలకాయం, మధుమేహం మరియు ఆస్తమా వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. ఎవరైనా తన ఇంటిని వదిలిపెట్టి విషపదార్ధాలున్న పొరుగుప్రదేశానికి వెళ్లి వాక్ చేయాలనుకుంటారా? మాలోని 27 శాతం స్థూలకాయం రేటు చాలా ఎక్కువ, ఈ దేశ సగటు కంటేకూడా, దాంతోపాటు అదనంగా మధుమేహం. మా సౌత్ బ్రాంక్స్ పిల్లల్లోని నలుగుర్లో ఒకరు ఆస్తమా వ్యాధిపీడితులు. మాలో ఆస్తమా వల్ల ఆసుపత్రిలో చేరేవారి రేటు దేశ సగటు కంటే ఏడు రెట్లు ఎక్కువ. ఈ ప్రభావాలు అందరికీ వ్యాపిస్తున్నాయి. మేము ఈ విష వ్యర్ధాలకోసం చాలా మూల్యాన్ని చెల్లిస్తున్నాము. ఈ ఆరోగ్య సమస్యలకు తోడు కాలుష్య౦, అపరిశుభ్ర వాతావరణ౦, మా నల్లజాతి యువతను, లాటిన్ అమెరికన్ల భవిష్యత్తును అ౦ధకార౦ చేస్తున్నాయి, వారి దగ్గర వెలికితీయనటువంటి సామర్ద్యం ఎ౦తో ఉ౦ది. మా వాళ్లలో యాభై శాతం మంది దారిద్ర్య రేఖకు దిగువనే జీవిస్తారు. ఇరవై ఐదు శాతం మంది నిరుద్యోగులు. అల్పాదాయం గల మా పొరులు ప్రాథమిక చికిత్సకోసం ఎమర్జెన్సీ రూములు దర్శించాల్సి వస్తుంది. ఈ అనారోగ్య౦ పన్ను చెల్లింపుదారుల మీద పెను భార౦ మోపుతున్నది. పేద ప్రజలు పేదరికంలో మగ్గడమే కాదు, వాళ్ళు అనారోగ్యంతో ఇంకా కునారిల్లుతున్నారు.
అదృష్ట వశాత్తూ, నాలాంటి చాలా మందిమి ఈ సమస్యల పరిష్కారానికి పనిచేస్తున్నాం అల్పాదాయం గల నల్లజాతి సమూహాల ప్రాణాలతో రాజీ పడకు౦డా మా ఆయు ప్రమాణాలను పె౦చుకునే౦దుకు పనిచేస్తున్నా౦. నల్ల జాతీయులు నశి౦చి పోవాలని మనలో ఎవరూ కోరుకోరు. అ౦తేకాదు మన౦దరిలో ఒక సమానమయిన గుణ౦ ఉ౦ది.
మనందరం, చాలా అందంగా ఉంటాం - (నవ్వులు)- హైస్కూల్ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యాము, కాలేజ్, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలున్నాయి, సుందరమైన ప్రదేశాలను దర్శించాము, ఎర్లీ టీన్స్ లో ఉన్న పిల్లలులేకుండా ఉన్నాము, ఆర్ధికంగా స్థిరంగా ఉన్నాము, ఒక్కసారికూడా జైలుకెళ్లకుండా ఉన్నాం, ఓకే. మంచిది. (నవ్వులు).
కానీ, నల్ల జాతి యువతిగా ఉండడంవల్ల, మీ అందరిలో చాలామంది కంటే నేను ఎన్నో విధాలుగా భిన్నమైన వ్యక్తిని . నా పొరుగున ఉన్న బిల్డింగులలో సగానికి పైగా తగలబడుతుంటే గమనించా. నా పెద్దన్నయ్య లెన్నీ వియత్నాంలో యుద్ధం చేస్తూ, వీరమరణ౦ పొ౦దిన కొద్దిమంది నల్లవారిలో ఒకడు. జీసస్. నేను మా వీధిలో ఉన్న ఒక కూలిన ఇంట్లో పెరిగాను. అవును. నేను మైనారిటీలు౦డే ప్రా౦త౦ నుంచి వచ్చిన ఒక పేద నల్లజాతి అమ్మయిని. ఈ విషయాలు నన్ను మీకన్నా భిన్నమైన వ్యక్తిని చేస్తాయి. కానీ మీతో కామన్ గా ఉన్న చాలా అంశాలు మా సమాజం నుంచి నన్ను వేరుచెస్తుంటాయి. ఇప్పుడు నేను ఈ రెండు ప్రపంచాల మధ్య ఉన్నాను. అవతలివైపున్న వారి న్యాయంకోసం పోరాడేందుకు చాలినంత ధైర్య౦ కూడా ఇప్పుడు నాలో ఉ౦ది.
కానీ కొన్ని అంశాలు మనందరికీ భిన్నంగా ఎందుకు ఉన్నాయి? నలభైల చివర్లో, మాడాడీ- ఒక పుల్ మాన్ పోర్టర్, ఒక బానిస తండ్రికి కొడుకు -- సౌత్ బ్రాంక్స్ లో ఉన్న హంట్స్ పాయింట్ సెక్షన్ లో ఒక ఇల్లు కొన్నారు, మరి కొద్ది సంవత్సరాల తర్వాత మా అమ్మను పెళ్లాడారు. ఆ సమయంలో మా సమాజంలో, చాలామంది శ్వేతజాతి కార్మికులు ఇరుగుపొరుగుగా ఉండేవారు. మా నాన్న ఒక్కరే కాదు.., ఇతర అమెరికన్ల లాగే ఆయన కూడా తనకే స్వంతమైన అమెరికన్ స్వప్నాన్ని కన్నారు, సౌత్ బ్రాంక్స్ తో బాటు దేశం లోని ఇతర ప్రాంతాలలోని శ్వేతజాతీయులు వలస వెళ్ళడ౦ సాధారణంగా జరిగిపోయి౦ది. బ్యాంకులు రెడ్ లైనింగ్ ఉపయోగించదంతో, సిటీలోని కొన్ని ప్రత్యేక వర్గాలతో బాటు, మా ప్రా౦త౦లో కూడా, ఏ పెట్టుబడులకూ అవకాశం లేకుండా పోయి౦ది. అనేకమంది భూయజమానులకు వారి ఇళ్లను ఈ స్థితిలో అమ్ముకోవడం కంటే వాటిని తగలబెట్టుకొని ఇన్సూరెన్స్ డబ్బుపొందడమే లాభదాయకంగా కనిపించింది -- అందులో కిరాయికి ఉన్నవాళ్ళు చనిపోయారా, గాయపడ్డారా పట్టించుకోలేదు.
హంట్స్ పాయింట్ ఒకప్పుడు వాక్ టూ వర్క్ సమాజంగా ఉండేది. ఇప్పుడు అక్కడ నివాసితులకు చేసే పనీలేదు, వెళ్లడానికి ఇళ్లూ లేవు. మా సమస్యలకు తోడు జాతీయ రహదారుల నిర్మాణ౦ అనే సమస్య కొత్తగా వచ్చి చేరింది. ఈ న్యూయార్క్ స్టేట్లో, రాబర్ట్ మోజెస్ అనే ఆయల్ విరివిగా హైవే విస్తరణ చర్యలకు ప్రచారం చేపట్టారు. వెస్ట్ చెస్టర్ కంట్రీలో ఉండే ధనవంతులు మన్ హట్టన్ కు వెళ్ళే౦దుకు సులువైన రహదారి కల్పన అతని ప్రధాన ఉద్దేశ్య౦. ఈ రహదారి నిర్మాణానికి సౌత్ బ్రా౦క్స్ అడ్డ౦కిగా ఉ౦డేది. సౌత్ బ్రా౦క్స్ నివాసితులకు ఒక్కోసారి నెలకంటే తక్కువసమయం నోటీసులిచ్చి వారి ఇళ్ళను కూలగొట్టేవారు. ఆవిధ౦గా 600,000 మందిని తరలించారు. సాధారణ ప్రజల నమ్మకం ఏమిటంటే సౌత్ బ్రాంక్స్ లో కేవలం వేశ్యలు,బ్రోకర్లు, పుషర్లు మాత్రమే ఉంటారు. మీ చిన్నతనం నించీ మీకు మీసమాజాలనుంచీ ఏ ఒక్క మంచి జరగడం లేదని నూరిపోస్తూ ఉంటే మీ సమాజ౦ గురి౦చి చెడుగా చెప్తూ ఉంటే అది మీపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? సో ఇప్పుడు, మా కుటుంబ సంపద విలువలేనిది, కానీ అదిమాత్రమే మేము సంపాదించి దాచగలిగాము. అదృష్టం కొద్దీ నాకు, ఆ ఇల్లు అందులోని ప్రేమాభిమానాలు, టీచర్ల సహాయం మరియు గురువులు ఇతర్ల సానుభూతి, అభిమానం లభి౦చాయి చాలు.
ఇప్పుడు, ఈ కథ ఎందుకు ముఖ్యంగా చెబుతున్నాన్న౦టే? ప్రణాళికా దృక్పధంతో చూస్తే, ఆర్ధిక తిరోగమనం పర్యావరణ క్షయానికి, అది తిరిగి సామాజిక క్షయానికి దారితీస్తుంది. 1960లలో మొదలైన పెట్టుబడుల ఉపసంహరణ భవిశ్యత్ పర్యావరణ పరమైన అన్యాయానికి బాటలు వేసింది. పురాతనమైన జోనింగ్ మరియు లాండ్ యూజ్ రెగ్యులేషన్లను నేటికీ ఉపయోగించి మా ఇరుగుపొరుగు ప్రదేశాలను కాలుష్యానికి గురిచేస్తున్నారు. కానీ ఈ అంశాలను లాండ్ యూజ్ పాలసీ నిర్ణయించేటపుడు పట్టించుకున్నారా? ఈ నిర్ణయాలకు మూల్యం ఎంతో తెలుసా? ఈమూల్యాన్ని ఎవరు చెల్లిస్తారు? ఎవరికి ప్రయోజనం కలుగుతోంది?స్థానిక సమాజాల ప్రయోజనాలను కాలరాచి ఏదిచేసినా చెల్లుబాటవుతుందా? ఇదీ "ప్రణాళిక" - ఇందులో మాకు సంబంధించిన మంచిని అసలు పరిగణనలోకి తీసుకోలేదు.
ఒకసారి ఇది మాకు అర్ధమయ్యాక, మేము మా ప్రణాళికలు స్వంతంగా తయారుచేసుకునే సమయమొచ్చిందని గ్రహించాం. నేనింతకు ముందు చూపించిన ఆ చిన్న పార్కు అందులోని మొదటి దశ సౌత్ బ్రాంక్స్ లో పచ్చదనం తెచ్చే ఉద్యమానికి తొలిఅడుగు. నేను ఒకటింబావు మిలియన్ల ట్రాన్స్ పోర్ట్ గ్రాంటుకోసం రాయడం జరిగింది వీధుల్లో బైక్ పాత్ కలిసిన వాటర్ ఫ్రంట్ ఎస్ప్లనేడ్ నిర్మాణం కోసం. పరిసరాల మెరుగుదలతో ట్రాఫిక్ సేఫ్టీపై పబ్లిక్ పాలసీ తయారీ సులభమై౦ది వ్యర్ధాలు ఇతర సౌకర్యాలను తెలుసుకోడానికి ఉపయోగపడ్తుంది, సౌకర్యాలను కల్ల్పి౦చే సమయ౦లోప్రజల జీవన ప్రమాణాలపట్ల రాజీ పడనవసరం లేదు. అవి మరింత భౌతికంగా క్రియాశీలకంగా ఉండేందుకు అవకాశాలు కల్పిస్తాయి, అలాగే స్థానిక ఆర్ధికాభివృద్ధీ జరుగుతుంది. బైక్ శాప్స్, జ్యూస్ స్టాంద్స్ గురించి ఆలోచించండి. మేము తొలిదశ ప్రాజెక్టు నిర్మాణానికి 20మిలియన్ డాలర్లు సేకరించాం. ఇది లాఫాయెట్ ఎవెన్యూ - ఇది మాథ్యూస్-లీల్సన్ లాండ్ స్కేప్ అర్కిటెక్ట్స్ వాళ్లచే రీడిజైన్ చేయబడింది. ఒకసారి ఈ దారి పూర్తయితే, అది సౌత్ బ్రాంక్స్ ను 400కు పైగా ఎకరాలున్న రాండెల్స్ ఐలాండ్ పార్క్ తో కలుపుతుంది. మేము ప్రస్తుతం ఇరవైఐదు అడుగుల వెడల్పుతొ ఉన్న నీటి ప్రవాహ౦తో వేరుచేయబడుతున్నాము, ఈ లింక్ మమ్మల్ని అవతలి ఒడ్డుతో కలుపుతు౦ది.
మేము సహజసిద్ధ ప్రాకృతిక పర్యావరణాన్ని పెంచడం వల్ల, అది మరిన్ని ప్రయోజనాలను తిరిగి ఇస్తుంది. మేము బ్రాంక్స్ ఎకలాజికల్ స్టీవార్డ్ షిప్ ట్రైనింగ్ అనే పాజెక్టును నిర్వహిస్తున్నాము, ఇందులో పర్యావరణ పునర్నిర్మాణానికి సంబంధించిన ఉద్యోగ శిక్షణ ఇవ్వబడుతుంది. అందువల్ల చక్కని ఆదాయం కలిగిన ఈ ఉద్యోగాలను సంపాదించేందుకు కావాల్సిన నైపుణ్యాన్ని మా వాళ్ళు సంపాదించగలరు. కొద్ది కొద్దిగా, ఈ ప్రాంతాన్ని మేము గ్రీన్ కాలర్ ఉద్యోగాల విత్తనాలను నాటుతున్నాం- అప్పుడే ప్రజలు పర్యావరణంలో ఆర్ధికంగా మరియు స్వంతంగా భాగస్వాములౌతారు. షెరిడన్ ఎక్స్ ప్రెస్ వే ను రాబర్ట్ మోజెస్ తరంలో కొద్ది మంది వినియోగానికి నిర్మాణం గావించారు. ఆ నిర్మాణం వల్ల విడిపోతున్న పొరుగుప్రాంతాలను పట్టించుకోకుండా అది నిర్మించారు. చివరికి రద్దీ సమయాల్లో కూడా, అది వాస్తవానికి ఖాళీగా కనిపిస్తుంది. మా సమాజం దీనికి ప్రత్యామ్నాయ ట్రాన్స్ పోర్టేషన్ ప్లాన్ రూపొందించింది దానివల్ల ఈ హైవేని తొలగించవచ్చు. మనకిప్పుడు అందర్నీ భాగస్వాముల్ని చేసే అవకాశం వచ్చింది 28 ఎకరాల ప్రదేశ౦లో పార్క్ లాండ్, తక్కువ ఖర్చుతో ఇళ్ళు నిర్మి౦చి ఎలా మెరుగ్గా స్థానికాభివృద్ధికి వినియోగించుకోవచ్చో ఆలోచి౦చాల్సి ఉ౦ది.
మేము సిటీలోని మొట్టమొదటి- న్యూయార్క్ లోని మొదటి గ్రీన్ మరియు కూల్ రూఫ్ ను మా ఆఫీసులపైన డిమాన్ స్ట్రేషన్ గా ఏర్పాటుచేశాం. కూల్ రూఫులు బాగా రిఫ్లెక్టయ్యే పదార్ధాలతో చేయబడి సోలార్ హీట్ ను పీల్చుకోవు అలాగే పరిసరాల్ని మరియు బిల్డింగును వేడెక్కనివ్వవు. మట్టి మరియు పచ్చని మొక్కలను గ్రీన్ రూఫ్ గా ఉపయోగిస్తున్నాము. పెట్రోలియం ఆధారిత పదార్ధాల పైకప్పుల కన్నా ఇవి మేలైనవి. అవి వేడిమిని పీల్చుకొని, అర్బన్"హీట్ ఐలాండ్" ఎఫెక్ట్ వల్ల సూర్యుని వేడితో వాడిపోయి చల్లగాలి వదులుతాయి దాన్ని మనం పీల్చుకుంటాం. గ్రీన్ రూఫ్ లు వర్షపాతంలో డెబ్బై ఐదు శాతాన్ని తమలో నిలుపుకుంటాయి, అందువల్ల సిటీకి అవసరమైన ఖరీదైన వాన నీటి పైపు లైన్ల నిర్మాణాల ఖర్చుతగ్గుతుంది -- వాన నీటి పైపు లైన్లను ప్రత్యేకంగా, మా లాంటి పర్యావరణ న్యాయంకోసం పోరాడే వారి దగ్గరే ఏర్పాటుచేస్తూ ఉంటారు. ఈ పైపులైన్లు మా చిన్న చిన్న మిత్రులకు ఆవాసాలుగా మారుతాయి! సో (నవ్వులు) - సో కూల్ ! ఏదేమైనప్పటికీ, ఈ డిమాన్ స్టేషన్ ప్రాజెక్టు మా స్వంత గ్రీన్ రూఫ్ ఇన్ స్టాలేషన్ బిజినెస్ యొక్క స్ప్రింగ్ బోర్డ్ గా మారి౦ది. దీ౦తో మా సౌత్ బ్రా౦క్స్లో నిర౦తర అభివృద్ధితో బాటు ఉపాధి కల్పన సాధ్యమై౦ది. (నవ్వులు) (చప్పట్లు). అది నాకు ఇష్టం, కూడా..
ఎనీ వే, ఇప్పటికే క్రిస్ మాకు చెప్పాడు ఇక్కడ అల్లరి ప్రవర్తన వద్దని, కానీ మీ అందరి అటెన్షన్ నాకు కావాలి: ఈ అల్లరికి చివర్లో పెట్టుబడులు కూడా. పర్మిషన్ అడగడం కంటే క్షమించమని అదగడం మంచిదికదా. ఎనీ వే -- (నవ్వులు). (చప్పట్లు).
ఓకే. కత్రీనా. కత్రీనాకు ముందు, సౌత్ బ్రాంక్స్ మరియు న్యూ ఓర్లియన్స్ నైన్త్ వార్డ్ లలో చాలా అ౦శాలు ఒకే విధ౦గా ఉన్నాయి.రెండూ కూడా పెద్ద ఎత్తున నల్లజాతి పేద ప్రజలతో ని౦డి ఉండేవి, రెండూ సాంస్కృతిక నైపుణ్యానికి నెలవులే: హిప్ హాప్ మరియు జాజ్ ను జ్ఞాపకం తెచ్చుకోండి. రెండూ వాటర్ ఫ్రంట్ కమ్యూనిటీలే మరియు రెండూ పరిశ్రమలకు నెలవులే ప్రజలుకూడా ఒకరికొకరు చాలా దగ్గరి పోలికలతో ఉంటారు. కత్రినా తుపాను తర్వాత ఈ రె౦డు ప్రా౦తాల మధ్య మరిన్ని పోలికలు వచ్చాయి. నియంత్రణా సంస్థలచే అశ్రద్ధకు, పీడనకు, దౌర్జన్యానికి గురికావడం ఇ౦కా పెరిగి౦ది, నిర్లక్షపూరితమైన జోనింగ్ తో ప్రభుత్వ అధికారుల జవాబుదారీతన౦ తగ్గి౦ది. నైన్త్ వార్డ్ గానీసౌత్ బ్రాంక్స్ గానీ నాశనం కావడం తప్పనిసరేం కాదు. కానీ మేము మాత్రం ఈ సమస్యలను౦చి మమ్మల్ని రక్షి౦చుకోవడానికి అవసరమైన విలువైన పాఠాల్ని నేర్చుకొని బయటపడ్డాం. మేము ఈ విధ౦గా నగరీకరణ పీడనకు జాతీయ చిహ్నాలుగా మారిపోయా౦. అధ్యక్ష ఎన్నికల అభ్యర్ధుల శుష్క వాగ్దానాలతో మా సమస్యలు తీరుతాయని ఎ౦తకాల౦ ఎదురుచూడాలి? మనం ఇప్పుడు గల్ఫ్ కోస్ట్ ను కూడా ఒక దశాబ్దం లేదా రెండు దశాబ్దాల పాటు సౌత్ బ్రాంక్స్ లాగే పీడిద్దామా? లేదా మనం క్రియాశీలక చర్యలను చేపట్టి సొ౦త్ అనుభవాలను౦చి పాఠాలు నేర్చుకుందామా లేదా నాలా౦టి తీవ్రమైన వేదనల పరిస్థితిలో జన్మించిన గ్రాస్ రూట్ యాక్టివిస్ట్ నుంచి నేర్చుకుందామా?
శ్రధ్ధగా వినండి, నేను వ్యక్తులను ఆశించడం లేదు, ప్రభుత్వం లేదా కార్పోరేషన్లు మనకు సదుపాయాలు తప్పక కల్పి౦చాలి. సౌకర్యాలు పొ౦దడ౦ మన నైతిక హక్కు. ఈ ప్రెజెంటేషన్ కేవలం నేను చూసిన పరిస్థితులు, నా అనుభవాలకు చిన్న ప్రతీక మాత్రమే. మీకు ఈ విషయాలు వి౦తగా అనిపిస్తాయి. కానీ మీరు తెలుసుకోదలచుకుంటే నేను మీకు తర్వాత వివర౦గా చెప్తాను. కానీ -- ఇది చాల కి౦ది స్థాయిలోనిది, లేదా ఒకరి దృక్పధం అనుకోవచ్చు, చివరికి అదే ప్రజల్ని చైతన్య పరుస్తుంది. నేను దీన్ని "ట్రిపుల్ బాటమ్ లైన్" గా పిలవాలని భావిస్తుంటాను. ఇదే నిర౦తర అభివృద్ధిని సాధ్య౦ చేయగలదు. అవసరమైన వాళ్లందరికీ గుణాత్మకమైన లాభాల్ని తెచ్చే పరిస్థులను అభివృద్ధి పుష్కలంగా కల్పిస్తు౦ది. ఈ ప్రాజెక్టులు అమలౌతున్న చోట డెవలపర్స్, ప్రభుత్వం, ప్రజలు లబ్దిపొ౦దుతారు. ప్రస్తుతం, ఈ న్యూయార్క్ నగరంలోఇది జరగడం లేదు. మేము సమగ్ర నగర ప్రణాళిక లేకు౦డా జీవన౦ సాగిస్తున్నా౦. సౌత్ బ్రా౦క్స్ లో ప్రతిపాది౦చిన పెద్ద భవనాలు, మరియు స్టేడియాల అభివృద్ధికి లెక్కలేనన్ని ప్రభుత్వ సబ్సిడీలు ఇస్తున్నారు, కానీ సమస్యల పరిష్కార౦ విషయ౦లో సిటీ ఏజెన్సీలమధ్య అవగాహన చాల తక్కువగా ఉంది పెరుగుతున్న ట్రాఫిక్, కాలుష్యం, సాలిడ్ వేస్ట్ల్ ల మొత్త౦ ప్రభావ౦ ఖాళీ ప్రదేశాలపై పడుతున్న వత్తిడిని నివారి౦చడంలో సిటీ ఏజెన్సీలు విఫలమయ్యాయి. స్థానిక ఆర్ఠికాభివృద్ధి ఉద్యోగాల కల్పనల అంశాలలో వారి దృక్పధం చవకబారుగానే కాదు హాస్యాస్పదంగా ఉంది. దానికి తోడు, ప్రపంచంలోని అత్యంత ధనికమైన స్పోర్ట్స్ టీం కోస౦ కమ్యూనిటీ పార్కు స్థలంలో క్లబ్ హౌస్ ను నిర్మించాలనుకుంటోంది. ఇదే జరిగితే, నేను మీకు చెప్పిన దానికన్నా గణాంకాలు చాలా దారుణంగా తయారౌతాయి. సౌత్ బ్రాంక్స్ లోని ఇరవై ఐదు శాతానికి లోపు ప్రజలకు మాత్రమే స్వంతంగా కార్లున్నా , ఈ ప్రాజెక్టుల్లో కొత్తగా వేల కొద్దీ కొత్త పార్కింగ్ స్థలా లను నెలకోల్పుతున్నారు, ఇంకా ప్రజల రవాణాసౌకర్యాల విషయంలో ఎన్నో అవకతవకలు జరుగుతున్నాయి. ఇప్పుడు, ప్రధానంగా లోపించినది ఏమిటంటే సమగ్ర అనారోగ్యకరమైన పర్యావరణ౦ కలిగిన సమాజ౦ మరియు నిర౦తర అభివధ్ధికి బాటలు వేసే నిర్మాణాలపై చేసే ఖర్చు, ఉపయోగ౦ విషయ౦లో తగిన విశ్లేషణ లేకపోవడ౦. ఆ౦దోళన కలిగి౦చే అ౦శ౦. మా ఏజెన్సీ కొలంబియా యూనివర్సిటీతో బాటు ఇతర స౦స్థలతోనూ కలిపి పనిచేస్తూ, ఈ అంశాలను వెలుగులోకి తెచ్చే ప్రయత్న౦ చేస్తున్నది.
నన్ను ఇప్పుడు అసలు విషయ చెప్పనివ్వండి. నేను అభివృద్ధి వ్యతిరేకురాల్ని కాదు. మనది ఒక నగరం, ఆటవిక రక్షిత స్థలం కాదు. మరియు నేను లోలోపల పెట్టుబడిదారీ మనసుతో ఉన్నా. మీ అందరిలోకూడా ఈ భావన ఉందనుకుంటా, ఒకవేళ లేకపోతే, పెట్టుబడిదారి భావాలు కల్పి౦చుకోవాలి. (నవ్వులు). అందుకే నాకు డెవలపర్స్ డబ్బులు సంపాదించుకోవడంలో ఎటువంటి సమస్యాలేదు. కానీ సమాజాల తోడ్పాటుతో వాటి మేలుకోస౦ జరిగే నిర౦తర అభివృద్ధి ద్వారా కూడా డెవలపర్స్ డబ్బు స౦పాది౦చుకోవచ్చు. తోటి టెడ్ స్టర్స్ బిల్ మెక్ డోనో మరియు ఎమెరీ లోవిన్స్ -- ఇద్దరూ నాకు హీరోలుగా సమానం - మనం చేయగలమని చూపించారు కూడా. ఇతరుల్ని దోపిడీకి గురిచేసే అభివృద్ధి పట్ల నాకు మంచి అభిప్రాయం లేదు ఇలా౦టి అభివృద్ధి రాజకీయంగా బలహీనమైన సమాజాలను స్వలాభంకోసం వాడుకుంటుంది ఒకవేళ అది అల్లాగే కొనసాగితే మనకు సిగ్గుచేటు, ఎందుకంటే తర్వాత ఏర్పదబోయే భవిష్యత్తుకు మనంకూడా కారణభూతులం అవుతా౦. కాబట్టి మనం ఇతర సిటీలలోని దార్శనికులు చూపిన కొన్ని అంశాలను నెర్చుకోవచ్చని నాకు గుర్తుకొచ్చింది. ఇది గ్లోబలైజేషన్ కి సంబంధించిన నా వెర్షన్.
మనం బొగోటా ను తీసుకుందాం. పేద లాటిల్ దేశ౦. చుట్టూ రాజ్యమేలే తుపాకీ హింస మరియు మాదక ద్రవ్యాల అక్రమ రవాణా: సౌత్ బ్రాంక్స్ బొగోటా కన్నా చాలా నయ౦. కానీ, బొగోటా సిటీ 1990ల చివర్లో ఒక అద్భుతానికి గురైంది ఎన్రిక్ పెనలోసా ఒక ప్రభావవంతమైన మేయర్ గా పేరు తెచ్చుకున్నారు. ఆయన జనావాసాలపై ఎక్కువ దృష్టి సారి౦చాడు. బొగోటన్లలో కొద్దిమందికి మాత్రమే కార్లున్నాయి. కానీ సిటీ వనరులలో చాలాభాగం వారికి సేవలుచేయడానికే అంకితమయ్యాయి. ఒకవేళ మీరే మేయర్ ఐతే, మీరు దానికి సంబంధించి ఏ౦ చేస్తారు. పెనొలోసా ఆధ్వర్య౦లోని మున్సిపల్ అధికారులు మార్గాలను ఐదులేన్లనుంచి మూడు లేన్లకు కుదించారు, ఆ వీధులోని పార్కింగ్ లేన్లను తీసివేసి, పాదచారులకు వాక్ వేలను నిర్మించారు. సైకిళ్ళ కోస౦ ప్రత్యేక లేన్లను ఏర్పాటుచేశారు, పబ్లిక్ ప్లాజాలను నిర్మి౦చారు. ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన మాస్ ట్రాన్సిట్ సిస్టెమ్ ను ఏర్పాటుచేశారు. అతని యొక్క ఈ సమర్ధమైన చర్యలకు గాను, అతను దాదాపు అభిశంసనకు గురికావాల్సి వచ్చింది. కానీ అక్కడి ప్రజలు అభివృధ్ధి విషయ౦లో తమకే పెధ్ద పీట వేస్తున్న విషయాన్ని గమని౦చారు. వారి దైనందిన జీవితాలలో అద్భుతమైన మార్పులు వచ్చాయి. ప్రజలు రోడ్లమీద ఉమ్మివేయడం మానివేశారు. నేరాలు తగ్గాయి. వీధులలో జనస౦దోహ౦ పెరగడమే ఇ౦దుకు కారణ౦.. పెనలోసా అడ్మినిస్ట్రేషన్ నగర౦లోని అన్ని సమస్యలపై ఒకేసారి యుధ్ధ౦ ప్రకటి౦చి౦ది అ౦దుకోస౦ వారు చేసిన ఖర్చు కూడా తక్కువ. నన్ను క్షమించండి. మన దేశంలో డబ్బుకు ఎలాంటి కొరతలేదు. కానీ అసలు విషయ్౦ ఏంటంటే, బొగోటాలో ప్రజలకు ఎక్కువ ప్రాధాన్య౦ ఇచ్చినా కార్లున్న వారిపైనే జరిమానాలు విధి౦చడ౦ పనిగా పెట్టుకోకు౦డా అభివృధ్ధిలో, సిటీ పునరుజ్జీవనంలో అ౦దరు బోగోటన్లను భాగస్వాముల్ని చేసి అ౦దరకూ అవకాశం కల్పించారు. ఏ అభివృద్ధి అయినా మెజారిటీ ప్రజల యొక్క ప్రయోజనాల్ని తాకట్టు పెట్టి జరగకూడదు. కానీ దీనికి విరుధ్ధమైన ఆలోచన ఇంకా అమెరికాలో రాడికల్ ఐడియాగా భావించబడుతున్నది. కానీ ఈ బొగోటా ఉదాహరణకు దాన్ని మార్చగలిగే శక్తి ఉంది.
కాకపోతే, అదృష్టవశాత్తూ మీరు, ప్రభావితం చేయగలిగే శక్తిని కలిగిఉన్నారు. అందుకే మీరిక్కడ ఉన్నారు మరియు మీరు మేం చెప్పే సమాచారానికి విలువనిస్తారు. అన్ని ప్రాంతాలలో ఈ నిర౦తర సమీకృత అభివృద్ధి కోసం మీ పలుకుబడిని ఉపయోగించండి. దీని గురించి టెడ్ లో మాట్లాడడం మాత్రమేకాదు. ఇది నా జాతీయస్థాయి ఎజెండా నిర్మించడంలో భాగం, మీకు తెలుసు, రాజకీయాలు వ్యక్తిగతమైనవి. నల్లవారిలో పచ్చని చిరునవ్వులు పూయి౦చడానికి సహాయం చేయండి. సస్టైనబిలిటీని సెక్సీగా చేయడానికి సహాయం చేయండి. మీ డిన్నర్ మరియు కాక్ టెయిల్ చర్చల్లో దీన్ని భాగం చేయండి. నేను పోరాడుతున్న పర్యావరణ మరియు ఆర్ధిక న్యాయం అంశాలలో సహాయం చేయండి. ట్రిపుల్ బాటమ్ లైన్ రిటర్న్ తో ఉండే పెట్టుబడులకు సహకరించండి. సస్టైనబిలిటీని ప్రజాస్వామ్యం చెసి అందర్నీ ఒకదగ్గరికి చేర్చడంలో సహకరించండి మరియు ప్రతీచోటా సమీకృత అభివృద్ధి ప్రణాళిక కోసం పట్టుబట్టండి. సంతోషం, నాకు కేటాయి౦చిన సమయ౦ ఇంకా కొద్దిగా మిగిలి ఉంది!
నేను ఒకరోజు మిస్టర్ గోర్ తో బ్రేక్ ఫాస్ట్ అనంతరం మాట్లాడినపుడు, మీ మార్కెటింగ్ స్ట్రాటజీలో పర్యావరణ కార్యకర్తలను ఎలా భాగస్వాముల్ని చేసుకోగలుగుతారని నేను ఆయన్నడిగాను. ఒక గ్రాంటు ప్రోగ్రాం ద్వారా వారిని కలుపుతామని ఆయన సమాధానమిచ్చాడు. తను నేను అతన్ని ఫండ్స్ కోసం అడగడం లేదని అర్ధం చేసుకోలేదనుకుంటాను. నేను ఆయనకి ఒక ఆఫర్ ఇచ్చాను. (చప్పట్లు).
నన్ను బాధించిన అంశం ఏమిటంటే " పైనుంచి క్రిందికి" అనే ఈ దృక్పధం ఇంకా ఉంది. ఇప్పుడు, నన్ను తప్పుగా అర్ధం చేసుకోకండి, మాకు డబ్బు కావాలి. (నవ్వులు). కానీ విధాన నిర్ణయాల సమయంలో కి౦దిస్థాయి ను౦చి గ్రూపులను భాగస్వాములను చేయాలి. మిస్టర్ గోర్ తొంభై శాతం ఎనర్జీని మనం ప్రతీరోజూ వృథా చేస్తామని గుర్తుచేసాడు. మనం వృథా చేసే ఎనర్జీని ఇంకా పెంచకండి, అలాగే మేధస్సును మరియు కష్టపడి సంపాదించిన అనుభవాన్ని అలా వేస్ట్ చేయకండి. (చప్పట్లు).
నేను చాలా దూరం నుంచి మిమ్మల్ని ఇలా కలవడానికి వచ్చాను. నా ప్రయత్నాన్ని వృధా కానివ్వండి. మన౦ కలసి పనిచేయడ౦ ద్వారా మనం చిన్న చిన్న, వేగంగా పెరిగే వ్యక్తి సమూహాలుగా మారి ధైర్యంగా ఈ ప్రపంచాన్ని మార్చగలమని నమ్మక౦తో చెప్పగలిగే స్థాయికి చేరుకు౦తా౦. ఈ సదస్సుకు వచ్చిన వారిలో వివిధ రకాల జీవన విధానాలు కలిగినవారున్నారు. కానీ నన్ను నమ్మండి, మన మంతా ఒక శక్తివంతమైన ముఖ్య విషయాన్ని ప౦చుకు౦తున్నా౦ -- దీనివల్ల మనకు అంతా లాభమే తప్ప. మనం కోల్పోయేదేమీలేదు. సియో బెల్లోస్! (చప్పట్లు)
You can share this video by copying this HTML to your clipboard and pasting into your blog or web page. This video will play with subtitles.
You either have JavaScript turned off or have an old version of the Adobe Flash Player. To view this rating widget you
need to get the latest Flash player.
If your browser allows only "trusted sites" to execute Javascript, you should add the "googleapis.com" domain to your whitelist to allow our Flash detection to work properly.
Got an idea, question, or debate inspired by this talk? Start a TED Conversation, or join one of these:
తన ఉద్రేకపూరిత ప్రసంగంలో, మెక్ అర్థర్ అవార్డు గ్రహీత అయిన సామాజిక కార్యకర్త మజోరా కార్టర్ సౌత్ బ్రాంక్స్ ప్రాంతంలో పర్యావరణ న్యాయంపై తనపోరాటాన్ని వివరిస్తూ- నగరీకరణ విధానాలలోని లోపాలవల్ల పొరుగున నివసిస్తున్న అల్పసంఖ్యాక వర్గాలు ఎలాంటి బాధలకు గురవుతున్నారో వివరించింది.
Majora Carter redefined the field of environmental equality, starting in the South Bronx at the turn of the century. Now she is leading the local economic development movement across the USA. Full bio »
18:00 Posted: Jan 2008
Views 2,344,967 | Comments 413
20:34 Posted: Oct 2007
Views 240,333 | Comments 56
15:43 Posted: Feb 2008
Views 382,700 | Comments 52
Just follow the guidelines outlined under our Creative Commons license.
This comment will be attributed to . Not ? Sign Out.