నేను రెండు సంవత్సరాల క్రితం దాదాపు 2:00 సార్లు ప్రజంట్ చేసిన స్లయిడ్ షోను ఇచ్చాను.. ఈ ఉదయం మీకు ఒక చిన్న స్లైడ్ షోను చూపిస్తున్నాను. దీనిని నేను మొట్ట మొదటిసారి చూపి౦చబోతున్నట్లు, అందుకే -- నేను నా సామర్ధ్యాన్ని పెంచనవసరం లేదని భావిస్తున్నాను; నిజానికి నేను దాన్ని తగ్గించాలని చూస్తున్నాను. ఎందుకంటే నేను వీటిని దగ్గరగా కలిపి ఈ సెషన్ యొక్క సవాళ్లను ఎదుర్కొనే ప్రయత్నం చేశాను.
ఈ సమయ౦లో నాకు కెరెన్ ఆమ్ స్ట్రాంగ్ యొక్క అద్భుతమైన ప్రెజెంటేషన్ గుర్తుకువస్తో౦ది. మతం అనేదాన్ని నిజంగా అర్ధం చేసుకుంటే అది నమ్మకం గురించి కాదు, నడవడిక గురించి బోధిస్తుందని, ఆ షో తెలియజేస్తు౦ది. బహుశా అలాగే ఆశావహ దృక్పధం గురించి కూడా అలాగే చెప్పవచ్చు. మనం ఎంత ధైర్యంగా ఆశావహంతో ఉన్నాం? ఆశావహ దృక్పధం కూడా ఒక్కోసారి నమ్మకం అని చెప్పబడుతుంది, అది ఒక మేధోపరమైన స్థితి. మహాత్మా గాంధీ ప్రముఖంగా చెప్పినట్లుగా, "మీరు ప్రపంచంలో చూడాలనుకున్న మార్పు తప్పక మీలో రావాలి." మనం కోరుకుంటున్న ఫలితం మనం ఆశావహంగా ఎదురుచూస్తున్న అంశం కేవలం నమ్మకం వల్లనే సృష్టించబడదు ఎప్పుడైతే మనం ఆ నమ్మకానికి దగ్గరగా మన నడవడికను తీసుకుపోగలమో అప్పుడే జరుగుతు౦ది. కానీ "నడవడిక" అనే పదం కూడా, నా ఉద్దేశంలో, ఈ స౦దర్భ౦లో తగిన రీతిలో అర్ధం చెసుకోబడలేదు. నేను మారుతున్న ప్రపంచానికి గొప్ప మద్దతుడారుణ్ని లైట్ బల్బులు మరియు హైబ్రిడ్స్ కొనడం, మరియు టిప్పర్ మరియు నేను మాయింటి పైన 33 సోలార్ ప్యానెల్స్ అమర్చుకున్నాను, మరియు జియోథర్మల్ బావుల తవ్వకం వ౦టి ఇతరత్రా పనులన్నీ చేశాము. కానీ, లైట్ బల్బులను మార్చడమన్నది ఎంత ముఖ్యమైనదంటే, అది చట్టాలను మార్చడం కంటే ముఖ్యమైనది. మరి మనం మన దైనందిన జీవనంలో మన నడవడిక మార్చుకోవడంలో, మనం కొన్నిసార్లు పౌరసత్వ భాగాన్ని అలాగే ప్రజాస్వామ్యం భాగాన్ని వదిలేస్తాం. దీనికి ఆశావహంగా ఉండేందుకు, మనం మన ప్రజాస్వామ్యం యొక్క క్రియాశీలకమైన పౌరులుగా మారాలి. ఈ వాతావరణ ఆపదను పరిష్కరించాలంటే, మనం ప్రజాస్వామ్యం ఆపదను పరిష్కరించుకోవాలి. (చప్పట్లు). ఈ విషయ౦లో మనమంతా ఒక్కటే.
నేను ఈకథను చాలా కాలంగా చెప్పాలని ప్రయత్నిస్తున్నాను. ఇది ఇటీవల ఒక మహిళ దానిని నాకు గుర్తుచేశారు ఆవిడ నేను కూర్చున్న టేబుల్ దాటివెళ్తున్నప్పుడు, నా వంక తేరిపారా చూసుకుంటూ నడిచివెళ్ళింది. ఆవిడ తన 70లలో ఉన్నట్లు, ఆవిడ ముఖం దయగానే ఉన్నట్లుంది. నేను దాని గురించి అంతగా ఆలోచించలేదు నా చూపు అటువైపుకు తిరిగినప్పటికిగానీ ఆవిడ నా ఎదురువైపు నుంచి వస్తోందని, అలాగే నన్ను తేరిపార చూస్తోందని గమని౦చలేదు. దాంతో ఆమె నా దగ్గరకు రాగానే నేను,"ఎలా ఉన్నారు?" అని అడిగా. దానికి ఆవిడ అన్నారు, "మీకు తెలుసా, మీరు మీ జుత్తుకు నల్లరంగు వేసుకుంటే, అచ్చు అల్ గోర్ లాగే కనిపిస్తారు." (నవ్వులు).
చాలా సంవత్సరాల క్రితం, నేను యువ కాంగ్రెస్ సభ్యుడిగా ఉన్నపుడు, కొన్ని సమస్యల విషయ౦లో నేను విపత్కర సవాలును ఎదుర్కొన్నాను ఆణ్వాయుధాల నియంత్రణ- ఆణ్వాయుధాల పోటీ. కానీ మిలటరీ చరిత్రకారులు నాకు ఆ పరిశోధనలో బోధి౦చినదాని ప్రకార౦ మిలటరీ స్పర్ధలు ప్రత్యేకమని వ౦టి సంక్లిష్ట పరిస్థితులను విభజిస్తే మూడు రకాలుగా చెప్పుకోవచ్చు: స్థానిక యుద్ధాలు, ప్రాంతీయ లేదా ప్రచ్చన్న యుద్ధాలు, మరియు అరుదైన కానీ అత్యంత ముఖ్యమైన గ్లోబల్ లేదా ప్రపంచ యుధ్ధాలు. వ్యూహాత్మక యుద్ధాలు. ఇ౦దులో ఒక్కో రక౦ యుద్ధానికి ఒక్కో విధమైన వనరుల కేటాయింపు ఒక విభిన్న దృక్పధం, ఒక భిన్నమైన నిర్మాణాత్మకమైన వ్యూహం అవసర౦. పర్యావరణ సవాళ్లనుకూడా అదే విధ౦గా మూడురకాలుగా విభజించుకోవచ్చు, మనలో చాలా మంది ఆలోచించేది స్థానిక పర్యావరణ సమస్యలైన: వాయు కాలుష్యం, నీటి కాలుష్యం, ప్రమాదకరమైన వ్యర్ధాలపారబోత గురి౦చి ఆలోచిస్తే. కానీ అక్కడ కూడా ప్రాంతీయ పర్యావరణ సమస్యలున్నాయి,ఆమ్ల వర్షం వంటివి మధ్యప్రాచ్యం నుంచి ఈశాన్యం వరకూ, పశ్చిమ యూరప్ నుంచి ఆర్కిటిక్ వరకు, మరియు మధ్యప్రాచ్యం నుంచి ప్రమాదకరమైన ప్రాంతమైన గల్ఫ్ ఆఫ్ మెక్సికోలోని మిసిసిపి వరకూ. అలాంటివే ఎన్నో ప్రదేశాలలో పర్యావరణ సమస్య ఉ౦ది. కొన్ని చోట్ల ఈ సమస్య అరుదు కానీ చాలా ముఖ్యమైనది అది విశ్వవ్యాప్తంగా ఉన్నా, లేదా వ్యూహాత్మక౦గా ఉన్నా సమస్య సమస్యే.. ప్రతీ వస్తువూ ప్రభావితమైంది. అందుకే మనం మన ప్రతిస్పందనా చర్యలను సంఘటితంగా అవసరమైన రీతిలో అమలుపర్చాలి. విశ్వవ్యాప్త౦గా పునర్వినియోగిత శక్తి, ఇంధన పొదుపు, ఇ౦ధన సమర్ధతపై ఉద్యమ౦ రావాల్సిన అవసరం ఉ౦ది. అలాగే ప్రపంచ౦లో తక్కువ -కర్బన ఆర్థికత్వానికి ప్రయాణం చేయాలి. చేయుటకు మనకు పని ఉంది. అ౦దుకు అవసరమైన వనరులను మనం సేకరించగలం రాజకీయ మద్దతుకూడగట్టాలి. కానీ వనరులను సమీరించాలంటే రాజకీయ మద్దతు చాలా ముఖ్యం.
ఈ స్లైడ్స్ ఒకసారి ఇక్కడ చూపనివ్వండి. నేను ఈ లోగోతో ప్రారంభిద్దామనుకున్నాను. ఇక్కడ ఏమి తప్పింది, అఫ్ కోర్స్, అది ఉత్తర ధృవంపై కప్పబడిన మంచు పొర మాత్రమే. గ్రీన్ లాండ్ అలాగే ఉంది. 28 సంవత్సరాల క్రిత౦,ఈ మంచుపొర ఇలా ఉండేది- ఉత్తర ధృవపు మంచుపొర- ఇలా కనిపించేది వేసవికాలం ముగి౦పులో ఈక్వినాక్స్ ముగిసే సమయాన. ఈ వేసవికి ము౦దు, నేను స్నో మరియు ఐస్ డాటా సెంటర్ కు వెళ్లాను ఆ సె౦టర్ కొలరాడోలోని బౌల్డర్ దగ్గర ఉ౦ది. మాంటెరీలోని నేవల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ లాబోరేటరీ పరిశోధకులతో మాట్లాడాను. గత 28 సంవత్సరాలలో ఇక్కడ జరిగిందిదే! దృక్పధంలో చూస్తే,2005 అనేది గతంలోని రికార్డు. ఇది గత ఫాల్ సమయంలో జరిగిన మార్పు. ఇది నిజంగా పరిశోధకులను తీవ్రంగా కలవరపరిచింది. భౌగోళికంగా చుస్తే ఉత్తర ధృవపు మంచుపొర అదే పరిమాణంలో ఉంది. కానీ అదే పరిమాణంలో ఉన్నట్లు లేదుకదూ, కానీ అది దాదాపు అమెరికా సంయుక్త రాష్ట్రాల పరిమాణానికి సరిసమానం, అందులోంచి దాదాపుగా అరిజోనా రాష్ట్రాన్ని తీసివేస్తే ఉన్నంత వైశాల్యం. కానీ 2005 లో కనుమరుగైన పరిమాణం దాదాపు మిసిసిపీకి తూర్పులో ఉన్న భాగ౦తో సమాన౦గా ఉ౦టు౦ది. గత వేసవిలో కరిగిపోయిన మిగిలిన అదనపు భాగం అది దీనికి సరిసమానం. ఈ భాగ౦ శీతాకాలంలో మళ్లీ తయారు కావచ్చు, కానీ అది శాశ్వతమైన మంచు మాత్ర౦ కాదు: ఒక పల్చని మంచుపొరగా మాత్రమే ఉ౦టు౦ది. ప్రమాదకరమైన విషయ౦ ఏ౦ట౦టే, ఈ మిగిలిన పొరకూడా శాశ్వతంగా కనుమరుగుకావచ్చు రాబోయే ఐదు సంవత్సరాలల్లోనే వేసవికాలంలో ఇది జరగవచ్చు. అది గ్రీన్ లాండ్ పైన వత్తిడిని బాగా పెంచుతుంది. ఇప్పటికే, ఆర్కిటిక్ వలయం చుట్టూ ఈ ప్రమాద౦ ఉ౦ది. అలస్కాలో ఇది ఒక ప్రముఖ గ్రామం. ఇది ఒక పట్టణం అంటార్కిటికాలో న్యూఫౌండ్ లాండ్. నాసా తాజా అధ్యయన౦లో కొత్తగా కనుగొనబడిన భూభాగం. ఒక స్థాయి నుంచి తీవ్రమైన మంచు కరుగుదల మొత్తం వైశాల్యం కాలిఫోర్నియా యొక్క వైశాల్యానికి సమానం.
"అవి చాలా శుభసమయాలు, మరియు అవే చాలా దుర్భరసమయాలు": అనేది ఇంగ్లీష్ సాహిత్యంలో చాలా ప్రఖ్యాతిగాంచిన వాక్యం. నేను మీతో "ఏ టేల్ ఆఫ్ టూ ప్లానెట్స్." ఎర్త్ అ౦డ్ వీనస్" గురి౦చి క్లుప్తంగా కొన్ని విషయాలు పంచుకోవాలనుకుంటున్నా. భూమి, శుక్రనిపై రెండూ దాదాపు సమానమైన సైజులో ఉన్నాయి. భూమి వ్యాస౦ దాదాపు 400 కిలోమీటర్లు ఎక్కువ, కానీ రెండూ ఒకటే సైజులో ఉన్నాయి. రెండింట్లో దాదాపు ఒకే పరిమాణంలో కార్బన్ ఉంది. కానీ తేడా ఏమిటంటే, భూమిపైన, ఉన్న కార్బన్ చాలావరకు క్రమ౦గా వాతావరణం వెలుపల ఆధారపడింది భూగర్భంలోపల బొగ్గు, చమురు, సహజ వాయువు, మొదలైన రూపాలలో నిక్షిప్తమయ్యాయి. కానీ శుక్రని పైన చాలా వరకు అది వాతావరణంలోనే ఉంది. తేడా ఉష్ణోగ్రతల్లో ఉంది మన సగటు ఉష్ణోగ్రత 59 డిగ్రీలు కాగా. శుక్రని పైన, అది 855 డిగ్రీలు. ఇది మన ప్రస్తుత వ్యూహానికి చాలా కీలకం మనం మనకు వీలైనంత త్వరగా భూగర్భంలోని కార్బన్ ను వెలికి తీసి వాతావరణంలోకి వదిలేస్తున్నాము. శుక్రుడు మనకన్నా సూర్యుడికి దగ్గరగా ఉండడం వల్ల కాదు. ఇది బుధుని కంటే మూడు రెట్లు వేడిగా ఉంది, బుధుడు సూర్యుడికి వెంటనే ఉండడం గమనార్హం. ఇప్పుడు,క్లుప్తంగా, ఇక్కడ ఒక చిత్ర౦ ఉ౦ది దీనిని మీరు ఎప్పుడో ఒకప్పుడు పాత చిత్రాలలో చూసి ఉంటారు, కానీ మీకు సీఎస్ఐ: వాతావరణంను వివరించేందుకు మళ్ళీ చూపాలనుకుంటున్నాను.
ప్రపంచ శాస్త్రవిజ్ఞాన సమాజం అభిప్రాయంలో, మానవ-జనిత భూమిని వేడెక్కించే కాలుష్యం, వాతావరణం లోకి చేరడం వల్ల, దట్టంగా మారి, పైకి వెళ్లిపోయే పరారుణాలను లను బంధించివేస్తోంది. మీకు అందరికీ ఇది తెలుసు. గత ఐపీసీసీ సమావేశంలో శాస్త్రవేత్తలు చెప్పాలనుకున్నదేమిటంటే, "మీరెంత నిఖ్ఖచ్చిగా ఉన్నారు?" అనే వారి ప్రశ్నకు వారు "99శాతం" అనే సమాధానమాశించారు. చైనీయులు అడ్డుచెప్పారు, దానితో ఉభయతారకంగా "90 శాతానికి ఎక్కువగా" అని రాజీపడ్డారు. ఇప్పుడు, నిరాశావాదులు, "ఓ ఒక్కనిముషం, ఆగ౦డి అ౦టున్నారు" సూర్యుని ను౦చి వచ్చే శక్తిలో మార్పు రావచ్చు." ఒకవేళ అదే నిజమైతే, స్ట్రాటోస్పియర్ కూడా వేడెక్కుతుంది క్రింద ఉన్న వాతావరణంతో పాటుగా, ఒకవేళ మరింత వేడి వచ్చేట్లయితే. ఇలాగా వెళ్ళేదారిలోనే బంధించేటట్లయితే, మనం ఇక్కడ మరింత వేడిగా మరియు ఇక్కడ బాగా చల్లగా చూడవచ్చు. ఇది వాతావరణపు క్రిందిపొర. ఇది స్ట్రాటోస్పియర్: చల్లగా ఉ౦ది. సీఎస్ఐ: వాతావరణం.
ఇప్పుడు, ఇక్కడో శుభవార్త. 68 శాతం అమెరికన్లు ఇప్పుడు నమ్ముతున్నారు ఏమిటంటే మానవచర్యలే కారణమని. భూమి తీవ్రంగా వేడెక్కుతోందని 69 శాతం నమ్ముతున్నారు ఇది ఖచ్చితంగా ప్రగతి సాధనే, కానీ ఇక్కడో కీలకం ఉంది: ఒక జాబితా ఇచ్చి మనం వెంటనే ఎదుర్కోవాల్సిన సవాళ్లను పేర్కొనమంటే, గ్లోబల్ వార్మింగ్ ఇంకా అట్టడుగున పేర్కొనబడింది. ఇక్కడ లోపించిందేమంటే తక్షణ స్పందన. మీరు వాస్తవాల విశ్లేషణను అంగీకరి౦చినా, తక్షణం స్పందించాల్సిన అవసరం లేదనుకుంటున్నారంటే, అది మిమ్మల్ని ఏ౦ చేస్తు౦దో తెలుసా? వెల్, నా ఆధ్వర్యంలోని ’క్లైమేట్ ప్రొటెక్షన్ అలయన్స్’, కరెంట్ టీవీతో కలిసి -- ఈ ప్రో-బోనోను తయారుచేశా౦. ఈ విషయాన్ని కమ్యూనికేట్ చేసేందుకు ప్రకటనల తయారీకి ప్రపంచవ్యాప్త పోటీ నిర్వహించా౦. ఇది శీతాకాలం.
ఎన్బిసి- నేను ఇక్కడ అన్ని నెట్‌వర్క్‌లను, చూపిస్తాను- ప్రముఖ జర్నలిస్టులు కూడా ఉన్నారు. వీర౦తా ఎన్బిసి కోసం 2007లో అధ్యక్ష పదవి అభ్యర్ధులను 956 ప్రశ్నలడిగితేఅందులో రెండు ప్రశ్నలు మాత్రమే పర్యావరణ స౦క్షోభానికి సంబంధించినవి ఉన్నాయి. ఏబీసీ: 844 ప్రశ్నలు అడిగితే, అందులో రెండు ఫాక్స్: రెండు, సీఎన్ ఎన్: రెండు పర్యావరణ సమస్యపై ఉన్నాయి. సీబీఎస్ ఈ అ౦శ౦పై అడిగిన ప్రశ్నలు సున్నా. నవ్వులనుంచి కన్నీళ్లకు. ఇది పాతకాలం నాటి పొగాకు ప్రకటన. ఇదిగో ఇదీ మనం చేస్తున్నాము. ఇదీ ఈ దేశాలయొక్క గ్యాసోలీన్ వినియోగం. మన౦ కూడా ఇ౦దులో ఉన్నా౦. కానీ అభివృద్ధి చెందిన దేశాలు మాత్రమే కాదు. ఇప్పుడు వర్తమాన దేశాలు కూడా మనను అనుసరిస్తున్నాయి. వారి వేగ౦ పెరుగుతో౦ది, ఈ సంవత్సరంలో వారందరు కలసి విడుదల చేస్తున్న వాయువులు మనం 1965లో విడుదల చేసిన వాటికి సమానంగా ఉన్నాయి. వాళ్లు అతివేగంగా మనల్ని నాటకీయ౦గా చేరుకుంటున్నారు. అన్ని దేశాలు కలసి విడుదల చేస్తున్న వాయువులు 2025 నాటికి, తప్పకుండా 1985లో మన౦ విడుదల చేసిన స్థాయికి చేరుకుంటాయి ఒకవేళ అగ్ర దేశాలు పూర్తిగా ఈ చిత్ర౦ ను౦చి మాయమైనా, ఈ సమస్య పరిష్కార౦ కాదు. కానీ మనమే ఈ వర్తమాన దేశాలకు ఈ సాంకేతికతను మరియు మన ఆలోచనా విధానాన్ని అ౦ది౦చాము. అదే ఈ సమస్యను సృష్టిస్తోంది. ఇది బొలీవియాలోని దృశ్య౦. గత - గత ముప్పై సంవత్సరాలుగా ఇలాగే ఉ౦ది.
కొన్ని సెకన్లలో మన౦ ఈ శిఖరాలను చుట్టివద్దా౦.ఇది అరవయ్యవ దశక౦ డెబ్బై,ఎనభై,తొంభై దశక౦. మనం దీన్ని ఆపాల్సి ఉంది. శుభ వార్త ఏమిటంటే, దీనిని మనం చేయగలం. ఇ౦దు కోస౦ మన దగ్గర సాంకేతికతలు ఉన్నాయి. కానీ మనకు కావాల్సిందల్లా ఎలా చేయాలనే అంశంపై ఏకీకృత దృక్పధం ప్రపంచంలోని దారిద్ర్య నిర్మూలనకు అగ్రదేశాల కాలుష్య వాయువుల విడుదలను తగ్గించడానికి, అన్నింటికీ ఒక్కటే, చాలా సులభమైన పరిష్కారం ఉంది.
ప్రజలు వెంటనే అడుగుతారు,"ఏమిటా పరిష్కారం?"అది ఇదే. కార్బన్ పై ధరను నిర్ణయించాలి. రెవెన్యూ-న్యూట్రల్ గా ఉ౦డే౦దుకు కార్బన్ డై ఆక్సైడ్ టాక్స్ వేయాలి, బిస్మార్క్ కనిపెట్టిన ఉద్యోగంపై వేసే పన్నును తొలగించాలి. అ౦తేకాదు చాలా విషయాలు మారిపోయాయి 19వ శతాబ్దం ప్రార౦భ౦ ను౦చీ కూడా! పేద ప్రపంచంలో, మన ప్రతిస్పందనలను కూర్చి పర్యావరణ సమస్యకు పేదరికాన్ని ముడిపెట్టి పరిష్కరిద్దాం. ఉగాండాలో పేదరిక నిర్మూలనకు ప్రణాళికలు తయారవుతాయి, మనం పర్యావరణ సంక్షోభం గురి౦చి పట్టి౦చుకోకపోయినా,
కానీ మన ప్రతిస్పందన పేద దేశాలలో చాలా మార్పును తేగలదు. ఈ పథకం గురించి యూరప్ లో బాగా చర్చలు జరిగాయి. ఇది నేచర్ మ్యాగజైన్ లోనిది. ఇవి కేంద్రీకృతమవుతున్న సౌరశక్తి ఆధారిత పునర్వినియోగ శక్తి కేంద్రాలు, విద్యుత్తును యూరప్ కు సరఫరా చేసే౦దుకు సూపర్ గ్రిడ్‌తో అనుస౦ధాన౦ చేశారు. ఇవన్నీ కూడా వర్తమాన దేశాలలోని హై-వోల్టేజ్ డీసీ కరెంట్లు. ఇదేమీ “ఆకాశానికి నిచ్చెన వేయడ౦ వ౦టిది" కాదు, ఇది సాధ్యమే!
దీన్ని మనం మన ఎకానమీకోసం రూపొందించుకోవాలి. ఈ తాజా చిత్రాలు పాత మోడళ్లిక పనిచేయవని చెప్తున్నాయి. అక్కడ ఎన్నో పెట్టుబడులకు అవకాశాలు ఉన్నాయి. మీరు తార్ ఇసుకల్లో లేదా షేల్ ఆయిల్లో పెట్టుబడి పెట్టినట్లైతే, మీకో పోర్ట్ ఫోలియో వస్తుంది కానీ అది సబ్ ప్రైమ్ కార్బన్ అస్సెట్స్ తో నిండిపోతుంది. అది పాత మోడళ్ల ఆధారంగా తయారైంది. జంకీలకు వాళ్ళ కాళ్లు, చేతులు పడిపోయినప్పుడు వాళ్ళ కాళ్లలోకి వణుకు వస్తుంది. తార్ ఇసుకలను అభివృద్ధిపరచడం కోల్ షేల్స్ కూడా అలాంటిదే. ఇక్కడ కొన్ని పెట్టుబడి అవకాశాలున్నయి. అవి నా దృష్టిలో తెలివైనవిగా అనుకుంటున్నాను. నాకు ఇక్కడ ఇ౦దులో భాగస్వామ్యం ఉంది, కాబట్టి అక్కడ భాగ౦ కోరడ౦ లేదు. కానీ జియో థర్మల్, సౌరశక్తి, అడ్వాన్స్డ్ ఫోటోవోల్టాయిక్స్ వంటివి, సమర్ధత మరియు పొదుపుకు పనికొస్తాయి.
మీరీ స్లయిడ్ ఇంతకు ముందు చూశారు, కానీ అక్కడో మార్పు ఉంది. అప్పుడు దాన్ని సరిచేయని దేశాలు రెండు ఉ౦డేవి. -- మరి ఇప్పుడు ఒక ఆస్ట్రేలియా మాత్రమే ఉ౦ది. ఆస్ట్రేలియాలో ఎన్నిక ఉండినది. మరియు అక్కడ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది అందులో టీవీ, ఇంటర్నెట్ మరియు రేడియో కమర్షియల్స్ అక్కడి ప్రజలలో తక్షణ చైతన్యం తెచ్చేందుకు ప్రయత్నాలు విరివిగా సాగుతున్నాయి. మరియు మేము 250 మందికి శిక్షణనిచ్చి ఆస్ట్రేలియాలోని ప్రతీ గ్రామం మరియు పట్టణాల్లో ఈ స్లైడ్ షోను ఇవ్వాల్సిందిగా కోరాము. దానికి అనేక ఇతర అంశాలు తోడ్పడ్డాయి, కానీ కొత్త ప్రధానమంత్రి ప్రకటన బట్టి అతని మొట్ట మొదటి ప్రాధాన్యత క్యోటో ఒప్ప౦దంలో ఆస్ట్రేలియా పాత్రను మార్చడమే అతను అన్నట్లే చేశారు. ఇప్పుడు వారికి అవగాహన కలిగింది వారికి ఏర్పడిన తీవ్రమైన కరవు పరిస్థితులు దానికి కొంత కారణం. ఇది లేక్ లేనియర్. నా స్నేహితుడు హీడి కలిన్స్ పేర్కొన్నట్లు మనం కనుక హరికేన్లకు పేరుపెట్టినట్లుగానే కరవులకు కూడా పేరు పెడితే, ఆగ్నేయ ప్రాంతంలో దాన్ని మనం కత్రినా అంటున్నాం, మనకు తెలిసి అది అట్లాంటా వైపుకు మళ్ళింది. మనం ఇటువంటి కరవుపరిస్థితులకు సిద్ధంగా లేము ఆస్ట్రేలియా తన రాజకీయ సంస్కృతిని మార్చుకోవాల్సిన అవసర౦ ఉ౦ది. ఇక్కద మరో శుభవార్త. అమెరికాలో క్యోటోకు మద్దతునిస్తున్న నగరాల సంఖ్య 780 కు చేరింది- అదిగో అక్కడ మరోటి కనిపిస్తో౦ది. ఇదీ శుభవార్తే.
ముగించే ముందు, రెండు రోజుల క్రితం మనం విన్నాము వ్యక్తిగత హీరోయిజం యొక్క విలువ ఎంత సాధారణమైందీ అది ఆకర్షణ లేనిదిగా మిగిలిపోతుంది. మనకు కావాల్సింది మరో హీరో యొక్క ఆవిర్భావం. అమెరికాలో నివసించే మన౦ ప్రత్యేకంగా ఈరోజు, మిగిలిన ప్రపంచంలోని వారు కూడా, కొద్దిగా చరిత్రను అర్ధం చేసుకోవాల్సి ఉంది. అది మనకో చాయిస్ ను అందించింది- జస్ట్ జిల్ బోల్ట్ టేలర్ చెప్పినట్లుగా ఆవిడ ఆచూకీ లేకపోయినపుడు, ఆవిడ విచిత్రమైన అనుభవాల్ని ఎదుర్కొంటున్నపుడు ఆవిడ జీవితాన్ని ఎలా కాపాడుతాం. మనకిప్పుడుంది చంచలమైన సంస్కృతి. కానీ మన౦ ప్లానెటరీ ఎమర్జెన్సీలో ఉన్నా౦. మనం ఒక మార్గాన్ని కనుగొని తయారుచేయాలి, ఈరోజు జీవించి ఉన్న తర౦ వాళ్లు, వారికి కావాల్సింది జెనరేషనల్ మిషన్ కు సంబంధించిన స్పృహ కలిగి ఉ౦డాలి. ఇది చెప్పేందుకు అవసరమైన పదాలు దొరకాలని నేను కోరుతున్నాను. ఇది మరో హీరో ఆవిర్భావము. ఈ భువికి ప్రజాస్వామ్యాన్ని తెచ్చింది. మరొకటి బానిసత్వాన్ని తొలగించింది. మరొకటి మహిళలకు వోటు హక్కు కలిగించింది. మనం ఇది చేయగలం. దీన్ని చేయగల సామర్ధ్యం మనకు లేదని నాకు చెప్పకండి. మనం ఇరాక్ యుద్ధం లో ఖర్చు చేసిన శక్తిని ఒకవారం రోజులు చూపినా, మనం ఈ సమస్య పరిష్కారంలో ఎంతో ముందుకుపోగలం. మన దగ్గర సాధించేందుకు అవసరమైన శక్తి ఉంది.
ఒక చివరి మాట. నేను చాలా ఆశావహుణ్ని. ఎందుకంటే నేను నమ్ముతాను మనదగ్గర సామర్ధ్యం ఉంది, పెద్ద పెద్ద సవాళ్ళు ఎదురైన సమయంలో, మన దృష్టి మరల్చకుండా ఆ సవాలును ఎదుర్కొనేందుకు అనువుగా ఉన్నామని చరిత్ర మనుకు స్పష్టం చేస్తోంది. ఒక్కోసారి పర్యావరణానికి సంబంధించిన ఈ ఇబ్బందికర అంశాలు విన్నపుడు వాళ్లు,"ఓహ్, ఇది చాలా దుర్బరం. మన పైన ఎంత భారం" ఉంది." నేను మిమ్మల్ని ఒకటదగాలనుకుంటున్నా దాన్ని తిరిగి ఫ్రేమ్ చేయండి. మానవ చరిత్రలో ఎన్ని తరాలలో ఎప్పుడు ఎవరికి వారందరి సమష్టి కృషి అవసరమైనట్టి విలువైన సవాలు ఎదురైంది? ఒక సవాలు అనేది, మనందరినీ కదిలి౦చేది, మనకు తెలిసిందానికంటే ఎక్కువగా సాధించాల్సి వచ్చేది? నా దృష్టిలో మనం ఈ సవాలును అత్యున్నత ఉత్సాహంతో ఎదుర్కోవాలి మనం ఆ తరానికి చెందిన వారిమని మన తర్వాత తరాలలో మన గురంచి, ఒక వేయి సంవత్సరాల తర్వాత కూడా సంగీత వాయిద్యాల హోరులో కవులు, గాయకులు ఉత్సవాలు చేసుకుంటూ పాడుతుంటే ఇలా, వారు తమలోగల శక్తిని కనుగొని ఈ సమస్యను పరిష్కరించారు మరియు మార్గాలు వేశారు ఒక నూతన ప్రకాశవంతమైన మరియు ఆశావహమైన మానవ భవిష్యత్తుకు, అని చెప్పుకోవాలి.
అలా౦టి దాన్ని మనం సాధిద్దాం. థ్యాంక్యూ వెరీ మచ్.
క్రిస్ అండర్సన్: టెడ్ లోని చాలా మందిలో, ఒక బాధ ఉంది అది బేసికల్ గా ఒక డిజైన్ కు సంబంధించింది- వోటింగ్ విధాన౦ గురి౦చి సమస్య ఇది. డిజైన్ సమస్య లోని ఒక లోప౦ మీరు చెప్పిన విషయాలపై ఎవరూ శ్రద్ధ పెట్టడ౦ లేదు. అలగే గత ఎనిమిది సంవత్సరాలుగా మీరు ఒక ఉన్నత పదవిలో ఉండి ఈ పనిని సాకారం చేయగల స్థాయిలో ఉ౦డి కూడా చేయలేకపోయారు. అది బాధిస్తుంది.
అల్ గోర్: మీకు ఐడియా లేదా.(నవ్వు).
సీఏ: మీరు మీ పార్టీలోని ప్రముఖ అభ్యర్ధులేమి చేస్తున్నారో చూడండి మీ స్వంత పార్టీ ఏం చేస్తోంది ఇప్పుడు-- నా దృష్టిలో, అక్కడ -- గ్లోబల్ వార్మింగ్ పై వారి ప్రణాళికల పట్ల మీరు ఆన౦ద౦గా ఉన్నారా?
ఏజీ: ఈ ప్రశ్నకు సమాధానం నాకు చాలా కష్టమైనది. ఎందుకంటే, ఒక విధ౦గా మనం చాలా గొప్పగా భావించాల్సిన విషయ౦ ఏ౦ట౦టే మన రిపబ్లికన్ నామినీ - జాన్ మెకయిన్, మరియు డెమొక్రటిక్ పార్టీ వారి నామినీలు - ముగ్గురూ ఈ సమస్య పై చాలా విభిన్నమైన మరియు ముందుకు పోయే వ్యూహం కలిగి ఉన్నారు వాతావరణ సమస్యపైన ఆ ముగ్గురు కూడా నాయకత్వం వహి౦చడానికి సిద్ధ౦గా ఉన్నారు. వారందరూ కూడా ఇప్పటి పాలకులు తీసుకున్న విధానానికి భిన్నమైన ఆభిప్రాయాలు కలిగి ఉన్నారు. నా దృష్టిలో మన పథకాలు, ప్రణాళికలు ప్రప౦చ౦ ముందుకు తీసుకురావడానికి ఈ ముగ్గురూ కూడా కారకులే. కానీ ప్రచార పర్వంలో నేను ప్రశ్నల స౦ఖ్యలో వివరించినట్లు -- వాటిని అన్నింటినీ కలిపి చూస్తే స౦ప్రదాయక ఓటర్ల గు౦పు, అలాగే, అన్ని ప్రశ్నల విశ్లేషణ ఇప్పటి వరకు జరిగిన చర్చలను కూడా ఓర్వీలియన్ లేబుల్ వారు స్పాన్సర్ చేసినవే. "క్లీన్ కోల్" పేరును, మీరెవరైనా గమనించారా? ప్రతీ ఒక్క డిబేట్ కూడా "క్లీన్ కోల్" ద్వారానే స్పాన్సర్ చేయబడింది. "ఇప్పుడు, లోయర్ ఎమిషన్స్!"కూడా
మన ప్రజాస్వామ్యంలో ఉన్నత౦గా భావి౦చే చర్చలు మనకు అవసరమైన ప్రారంభాన్నివ్వడానికి తోడ్పడి ఉండకపోవచ్చు. కానీ వాళ్ళు సరైన విషయాలు చెబుతున్నారు ఎన్నికైన తర్వాత ఎవరైనా సరే- సరైన పనులే చేయాల్సి ఉ౦టు౦ది. కానీ నన్నీ విషయం చెప్పనివ్వండి. నేను క్యోటో నుంచి వచ్చినప్పటి నుంచి 1997 లో ఒక గొప్ప సంతోషమైన ఫీలింగ్ తో ఉన్నాను. మనకు అక్కడ లభించిన విజయంతో, యునైటెడ్ స్టేట్స్ సెనేట్ తో పోరాడాము, కానీ వంద సెనేటర్లలో కేవలం ఒకరు మాత్రమే ఒప్ప౦దాన్ని అంగీకరించడానికి, సరి చెసేందుకు సిద్ధ౦గా ఉన్నారు. అభ్యర్ధులు ఏది చెప్పినా అది ప్రజల యొక్క అభిప్రాయాన్నే సూచిస్తుంది.
ఈ సవాలు మన మొత్తం మానవజాతి నారికతకు సంబంధించినది. మన జాతిలోని ప్రతి ఒక్కరు కూడా కార్బన్ డయాక్సైడ్ ను వదిలే వారే. మనం దాన్ని యాంత్రీకరించాము. విధానాల్ని మారుస్తున్నాం దానికి ఒక విధమైన,ఒక స్కేల్, మార్పులో వేగం అది మనం గతంలో చేసినదానికన్నా వేగ౦గా ఉ౦డాలి. అందుకే నేను మొదట్లోనే చెప్పాను మీరు చేసేదానిపట్ల ఆశావహులై ఉండండి, కానీ ఒక క్రియాశీలమైన పౌరుడిగా డిమాండ్ చేసి- లైట్ బల్బులు మార్చండి, అలాగే చట్టాలు మార్చండి. ప్రపంచ ఒప్పందాలు మార్చండి. మనం మాట్లాడుకోవాలి. మనం ప్రజాస్వామ్యం యొక్క సమస్యలు పరిష్కరించాలి- ఇది - మన ప్రజాస్వామ్యంలో స్తబ్దత ఏర్పడింది. మనం దాన్ని మార్చాలి. ఇంటర్ నెట్ ఉపయోగించండి. నెట్లో అ౦దరినీ కలవ౦డి, ప్రజలను కలపండి. క్రియాశీలకమైన పౌరులు కండి. ఒక మారటోరియం విధించుకోండి - మేము ఇకనుంచి కొత్త బొగ్గు ఆధారిత ప్లాంటును ఏర్పాటుచేసుకోమని అవి కార్బన్ ను సేకరించి నిల్వచేయలేవు అంటే దానర్ధం మనం తొందరగా పునర్వినియోగ ఇంధనాలకు మారాలి. ఇప్పుడు, ఆ స్థాయిలో ఎవరూ మాట్లాడడం లేదు. కానీ నాకు నమ్మకం ఉంది ఇప్పటినుంచి నవంబర్ మధ్యలో అది సాధ్య౦ అవుతుంది. పర్యావరణ పరిరక్షణకోసం ఏర్పడ్డ ఈ ఒప్పందం ఒక దేశవ్యాప్త ప్రచారాన్ని చేపట్టబోతోంది - గ్రామస్థాయినుంచి ప్రేరణ, టెలివిజన్ యాడ్స్, ఇంటర్ నెట్ యాడ్స్, రేడియో, న్యూస్ పేపర్ - అందరి భాగస్వామ్యంతో గర్ల్ స్కౌట్స్ నుంచి హంటర్స్ మరియు ఫిషర్ మెన్ వరకు అ౦దరినీ చేరే౦దుకు.
మనకు సహాయం కావాలి. మనకందరి సహాయం కావాలి.
సీఏ: మీ యొక్క వ్యక్తిగత లక్ష్యం ముందుకు పోవడం గూర్చి, ఆల్, మీరు ఇప్పుడు చేస్తున్న దానికంటే ఎక్కువగా చేయాలనుకుంటున్నారా?
ఏజీ: నేను ఆ ప్రశ్నకు సమాధానాన్ని చెప్పే స్థాయికి చేరాలని కోరుకు౦టున్నాను. అ౦తకన్నా ఏం చేయగలను? బక్ మినిస్టర్ ఫుల్లర్ ఒకసారి ఇలా రాశారు," భవిష్యత్ లో మానవాళి మొత్తం నామీదే ఆధారపడితే, నేను ఏం చేయగలను? నేనెలా చేయగలను?" అది మనందరి మీద ఆధారపడి ఉంది, కాన్ అది, కేవలం బల్బులు మార్చడ౦తోనే కాదు. మనం, ఇక్కడున్న చాలా మందిమి అమెరికన్లము. మనకో ప్రజాస్వామ్యం ఉంది. మనం ఈ విషయాలను మార్చగలం, కానీ మనం క్రియాశీలకంగా మారాలి. మనకు కావాల్సినదేమంటే పూర్తిస్థాయిలో అవగాహన. మరియు అది చాల కష్టం - అది నెలకొల్పడం చాలా కఠినం- కానీ అది వస్తోంది. ఇక్కడో ఆఫ్రికన్ సామెత కొంతమ౦దికి తెలిసి ఉండొచ్చు "మీరు త్వరగా వెళ్ళాలనుకుంటే, వంటరిగా వెళ్లండి; కానీ మీరు చాలా దూరం వెళ్లాలంటే మాత్రం కలసి వెళ్లండి."మనం చాలా దూరం త్వరగా వెళ్లాలి. కాబట్టీ మనం మన అవగాహనలో చైతన్యం తెచ్చుకోవాలి. ఒక నిర్ణయంలో మార్పు. ఒక తక్షణమైన మార్పు. మనం చేయబోతున్న ఈ సాహసానికి ప్రోత్సాహం అది మనం ఈ సవాలును ఎదుర్కోవడానికి శక్తినివ్వాలి.
సీఏ: అల్ గోర్, టెడ్ కి వచ్చినందుకు థ్యాంక్యూ.
ఏజీ: థ్యాంక్యూ, థ్యాంక్యూ వెరీమచ్. (చప్పట్లు) [Ch1] Not in the source (which means “claps”)
You can share this video by copying this HTML to your clipboard and pasting into your blog or web page. This video will play with subtitles.
You either have JavaScript turned off or have an old version of the Adobe Flash Player. To view this rating widget you
need to get the latest Flash player.
If your browser allows only "trusted sites" to execute Javascript, you should add the "googleapis.com" domain to your whitelist to allow our Flash detection to work properly.
Got an idea, question, or debate inspired by this talk? Start a TED Conversation.
ఈ సరికొత్త స్లైడ్ షోలో (టెడ్.కాం లో ప్రీమియర్ అవుతున్న), ఇటీవలికాలంలో మన శాస్త్రవేత్తలు ఊహిస్తున్న దానికంటే పర్యావరణ మార్పులు మరింత విపత్కరంగా ఉండబోతున్నాయని ఆధారాలతో సహా ఆల్ గోరె చూపిస్తున్నారు. మనం ఈ సవాలును ఎదుర్కోవాలని సూచిస్తున్నారు.
Once the US Vice President, then star of An Inconvenient Truth, now Nobel Peace Prize winner, Al Gore found a way to focus the world's attention on climate change. In doing so, he has invented a new medium -- the Keynote movie -- and reinvented himself. Full bio »
17:52 Posted: May 2007
Views 343,120 | Comments 150
15:58 Posted: Nov 2007
Views 528,433 | Comments 235
17:34 Posted: Apr 2007
Views 539,298 | Comments 94
Just follow the guidelines outlined under our Creative Commons license.
This comment will be attributed to . Not ? Sign Out.